నాగోబా జాతర ఆదాయం రూ.20. 74 లక్షలు

నాగోబా జాతర ఆదాయం రూ.20. 74 లక్షలు

ఇంద్రవెల్లి, వెలుగు: నాగోబా జాతర సందర్భంగా భక్తులు కానుకలుగా సమర్పించగా  మంగళవారం హుండీల లెక్కింపు చేయగా.. రూ. 8,93,797 ,  మిశ్రమ వెండి 252 గ్రాములు వచ్చాయనిఈవో ముక్త రవి తెలిపారు. మెస్రం వంశీయులు, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించారు. తై బజార్ ద్వారా  రూ.11. 81 లక్షల ఆదాయం వచ్చిందని, మొత్తంగా.. రూ. 20,74,797 ఆదాయం సమకూరి నట్టు చెప్పారు.

 కార్యక్రమంలో తహ సీల్దార్ ప్రవీణ్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనందరావు, మెస్రం వంశీయులు మెస్రం కోసేరావ్, మెస్రం దాదారావ్, నాగనాథ్, మెస్రం వంశం ఉద్యోగస్తులు దేవ్ రావ్, శేఖర్ బాబు తదితరులు ఉన్నారు. ఆదిలాబాద్​జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​లో ఈనెల18న ప్రారంభమైన నాగోబ జాతర సోమవారం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే.