కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ 

దేవరకొండ, వెలుగు: కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలకు దమ్ముంటే కేటీఆర్, హరీశ్​రావు సమాధానం చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండ టౌన్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్​తో కలిసి పాల్గొని మాట్లాడారు.  కవిత వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు.

సీఎం రేవంత్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని, సామాన్య కార్యకర్తనైన తనను మంత్రిని చేసి సముచిత స్థానం కల్పించారన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహుల్లో ఎవరికైనా టికెట్లు రాకపోతే కో ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు, మార్కెట్ డైరెక్టర్లు, నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.