‘శాసన సభ’ చిత్రంతో రచయితగా రాఘవేంద్ర రెడ్డి

  ‘శాసన సభ’ చిత్రంతో రచయితగా  రాఘవేంద్ర రెడ్డి

పొలిటిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించి ఆ తరువాత సినీ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓగా, శాటిలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినీ పరిశ్రమకు దగ్గరయ్యాడు రాఘవేంద్ర రెడ్డి.  ‘శాసన సభ’ చిత్రంతో ఆయన రచయితగా పరిచయమవుతున్నాడు. ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా వేణు మడికండి దర్శకత్వంలో సప్పాని బ్రదర్స్ నిర్మించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ‘అసెంబ్లీ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీ కావడంతో ‘శాసన సభ’ టైటిల్ పెట్టాం. కథతో పాటు స్ర్కీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, డైలాగ్స్ కూడా నేనే రాశాను. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఇది రాశా. శాసనసభ అంటే పవిత్రస్థలం. దాన్ని  ఓ దేవాలయంగా భావించాలి. కానీ ఇప్పుడు శాసనసభ విలువలు మసకబారుతున్నాయి. ఆ వాల్యూను ఈ జనరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెప్పాలనే ఉద్దేశంతో, సామాన్య ఓటర్లను ఆలోచింపజేసేలా తీశాం. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తుంది. ఓటు విలువను చెప్పే పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తారు. ఇక నా నెక్స్ట్ మూవీగా ఓ యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్విస్టిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థ్ల్రిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కథను అందించాను. షూటింగ్ జరుగుతోంది’ అని చెప్పారు.