ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 సీట్లు గెలుస్తాం: రఘునందన్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 సీట్లు గెలుస్తాం:  రఘునందన్ రావు

రామాయంపేట, వెలుగు: మెదక్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ 5  అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం రామాయంపేటలో మెదక్ నియోజక వర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి రఘునందన్ రావు తో పాటు, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే ఈశ్వర్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ , బొరుసు లాంటివని అభి వర్ణించారు.

కాంగ్రెస్​ నేతలు కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చతికిల పడ్డారని, అలాంటిది తెలంగాణ లో ఎలా అమలుచేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ బీసీ బిడ్డనే సీఎం చేస్తామని ప్రకటించిది అలాంటి దమ్ము ధైర్యం ఏ పార్టీ కైన ఉందా అని ప్రశ్నించారు.  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు నందారెడ్డి, విజయ్ కుమార్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, చంద్ర శేఖర్, ప్రభాకర్ ఉన్నారు.

దుబ్బాక:  బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ క్యాండిడేట్​ సీఎం అవుతారని ఎమ్మెల్యే రఘునందన్​రావు స్పష్టం చేశారు. మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల, అల్వాల, లింగుపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేసీఆర్, ​కేటీఆర్​ను సీఎం చేయడం, సోనియా గాంధీ, రాహుల్​ను ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని కానీ  దేశం కోసం, ధర్మం కోసం, ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నాడని కొనియాడారు.

రెండు సార్లు గెలిచిన కారోళ్లు చెప్యాల, అల్వాల, లింగుపల్లి గ్రామాల్లో నిర్మించిన డబుల్​ బెడ్రూమ్​లను పేదలకు ఎందుకు పంపిణీ చేయలేదో నిలదీయాలని పిలుపు నిచ్చారు. తొమ్మిదేళ్లుగా ఎంపీగా పని చేస్తున్న కొత్త ప్రభాకర్​ రెడ్డి ఏనాడైనా దుబ్బాక నియోజకవర్గానికి వచ్చాడా, ఏమైనా అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చారో అడగాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్​ సభ్యుడు అంబటి బాలేశ్ గౌడ్​, మండల అధ్యక్షుడు ఎలుముల దేవరాజు పాల్గొన్నారు.