సిద్దిపేటలో టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం

సిద్దిపేటలో టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం

సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులలో ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామంలో మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. రఘునందన్ కారు ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను సముదాయించారు. 

కెమెరాల్లో నీతులు వల్లిస్తూ.. దేశాన్ని దోచేస్తున్నారు

ఈ స్థాయిలో రిజర్వేషన్.. రాజ్యాంగ విరుద్ధం

‘రతన్ టాటాకు భారతరత్న’ పిల్ ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు