Ajinkya Rahane: లీస్టర్ షైర్ క్లబ్తో రహానే ఒప్పందం

Ajinkya Rahane: లీస్టర్ షైర్ క్లబ్తో రహానే ఒప్పందం

ఫామ్ కోల్పోయి టీమిండియాకు దూరమైన సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానె తిరిగి పుంజుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రాక్టీస్ కోసం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత తను కౌంటీల్లో ఆడనున్నాడు. దీనికోసం రహానే లీస్టర్ షై ర్ క్లబ్ తో ఒప్పందం కుదుర్చున్నాడు. 34 ఏండ్ల రహానె గతేడాది జనవరిలో చివరి టెస్టు ఆడాడు. ఫామ్ కోల్పోవడంతో ఆ తర్వాత నేషనల్ టీమ్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో ముంబై తరపున బరిలోకి దిగి ఓ డబుల్ సెంచరీ, మరో భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

టీమిండియాలో రీఎంట్రీనే టార్గెట్ గా ఐపీఎల్ తర్వాత లీస్టర్ షైర్ క్లబ్ లో చేరబోతున్నాడు. వచ్చే కౌంటీ సీజన్లో ఎనిమిది కౌంటీ మ్యాచ్లతో పాటు, వన్డే కప్ టోర్నీ మొత్తానికి రహానె అందుబాటులో ఉంటాడని క్లబ్ మంగళవారం ప్రకటించింది. ‘రాబోయే సీజన్లో లీస్టర్ షైర్లో చేరడం చాలా సంతోషంగా ఉంది.  నా కొత్త టీమ్ మేట్స్ తో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా’ అని రహానె చెప్పాడు.