వాయనాడ్ లో రాహుల్​ ​, ప్రియాంక టూర్​.. కొండచరియలు విరిగి పడిన ప్రాంతం సందర్శన

వాయనాడ్ లో రాహుల్​ ​, ప్రియాంక టూర్​..  కొండచరియలు విరిగి పడిన ప్రాంతం సందర్శన


కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ వాయనాడ్లో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో  పర్యటించారు.వీరి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఉన్నారు. కన్నూరు ఎయిర్​ పోర్ట్ నుంచిరోడ్డు మార్గంలో సుల్తాన్ బతేరీకి వెళ్లారు.  కేరళలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించారు.  ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు.   వాయనాడ్​ ఘటనపై సీఎం విజయిన్​ తో చర్చించనున్నారు.  

ఇంకా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని... అయినా వేగంగా సహాయక చర్యలుకొనసాగుతున్నాయన్నారు.  వాస్తవానికి బుధవారం( జులై 31)న సందర్శించాలనుకున్న రాహుల్​, ప్రియాంకలు... ప్రతికూల వాతావరణం కారణంగా ఈ రోజు ( ఆగస్టు 1)న వెళ్లారు.  ఈ విషయాన్ని   పార్లమెంట్​లో లేవనెత్తానని ప్రతిపక్షనేత రాహుల్​ అన్నారు. వాయనాడ్​ ఘటనపై అంచనా వేసేందుకు రక్షణశాఖామంత్రి.. సీఎం విజయన్​ తో మాట్లాడానన్నారు. 

కేరళలో ప్రకృతి వైపరీత్యాలలో  వాయనాడ్లో కుండపోత వర్షం కారణంగా సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఇప్పటికి 282 మంది మరణించారు .   200 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల  240 మంది చిక్కుకు పోయారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.