రాహుల్ వంట.. అదిరేనంట.. వీడియో వైరల్

రాహుల్ వంట.. అదిరేనంట.. వీడియో వైరల్

చెన్నై: రాజకీయాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రాహుల్ గాంధీ సరదాగా గరిటె తిప్పారు. యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన ‘‘విలేజ్ కుకింగ్ చానెల్” టీమ్ తో కలిసి వంట చేసి వావ్ అనిపించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 40లక్షలకు పైగా వ్యూస్, 4.3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. పోయిన వారం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్.. ‘‘విలేజ్ కుకింగ్ చానెల్” టీమ్ ను కలిశారు. వారు మష్రూమ్ (పుట్టగొడుగులు) బిర్యానీ తయారు చేయగా హెల్ప్ చేశారు. బిర్యానీలోకి అవసరమైన రైతాను రాహులే రెడీ చేశారు. ఈ టైమ్ లో రాహుల్ వారితో సరదాగా ముచ్చట్లు పెట్టారు. వంట చేసేందుకు వాడిన పదార్థాలను తమిళంలో ఏం అంటారో తెలుసుకొని.. తానూ వాటి పేర్లను పలుకుతూ సందడి చేశారు. తర్వాత వారితో కలిసి అరటి ఆకులో వడ్డించిన బిర్యానీ తిన్నారు. బిర్యానీ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇతర రాష్ట్రాలకూ వెళ్లి కుకింగ్ వీడియోలు చేయాలని వాళ్లకు సూచించారు. విలేజ్ కుకింగ్ చానెల్ టీమ్.. ఇదంతా వీడియో తీసి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా వైరల్ అయింది. రాహుల్ వంట.. అదిరిందంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రాహుల్ తమిళంలో భలే మాట్లాడారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

For More News..

వింత తీర్పుల జడ్జికి సుప్రీంకోర్టు షాక్‌‌

అగ్రి చట్టాలను ఏడాదిన్నర నిలిపేసేందుకు కట్టుబడి ఉన్నం

రికార్డుస్థాయిలో వరి సాగు.. ఇప్పటికే 50 లక్షల ఎకరాల్లో నాట్లు