మిథాలీరాజ్ బయోపిక్ నుంచి డైరెక్టర్ రాహుల్ అవుట్

మిథాలీరాజ్ బయోపిక్ నుంచి  డైరెక్టర్ రాహుల్  అవుట్

సాధారణంగా ఒక సినిమా మొదలయ్యాక మధ్యలో నటీనటులు మారతారేమో కానీ దర్శకుడు మారడం చాలా అరుదు. అందులోనూ ఓ సంవత్సరం ఆ సినిమాపై పని చేశాక అస్సలు చేంజ్‌‌‌‌ అవ్వడు. కానీ తాప్సీ మూవీ విషయంలో అది జరిగింది. ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్‌‌‌‌ బయోపిక్‌‌‌‌ను ‘శభాష్‌‌‌‌ మిథూ’ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాప్సీ లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీపై సంవత్సరం నుంచి స్క్రిప్ట్‌‌‌‌ వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పూర్తై, సినిమా కొన్ని రోజుల్లో సెట్స్‌‌‌‌కి కూడా వెళ్లబోతోంది. అంతలో డైరెక్టర్ చెయిర్‌‌‌‌‌‌‌‌ నుంచి రాహుల్ ధోలాకియా తప్పుకున్నాడు. అతని స్థానంలోకి శ్రీజిత్ ముఖర్జీ వచ్చాడు. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. షారుఖ్ లాంటి స్టార్‌‌‌‌‌‌‌‌తో పని చేసిన రాహుల్‌‌‌‌ వర్క్ చేయడమనేది ఇలాంటి చిన్న సినిమాకి కలిసొచ్చే అంశమే. అలాంటిది తననెందుకు తప్పించారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం మొదలైంది. దానికి టీమ్ రియాక్ట్ కాలేదు కానీ రాహుల్ మాత్రం ఓ నోట్ రిలీజ్ చేశాడు. తనకెంతో నచ్చిన ఈ సినిమా నుంచి కొన్ని అనుకోని కారణాల వల్ల తప్పుకోవాల్సి వస్తోందన్న రాహుల్.. టీమ్‌‌‌‌ గురించి పాజిటివ్‌‌‌‌గా మాట్లాడటమే కాక ‘ఆల్‌‌‌‌ ద బెస్ట్’ కూడా చెప్పాడు. అది తనంతట తనే చెప్పాడో లేక తప్పనిసరై చెప్పాల్సి వచ్చిందో తెలీదు కానీ.. అతను తప్పుకోవడం మాత్రం అందరికీ షాకిచ్చింది. టీమ్‌‌‌‌ తీరు నచ్చక అతనే వెళ్లిపోయాడని  కొందరు అంటుంటే, అతని తీరు నచ్చక నిర్మాతలే తప్పించారని మరికొందరు అంటున్నారు. నిజమేమిటో వారికే తెలియాలి.