
సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతూ విమర్శలు ఎదురుకుంటున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ కు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం అనేది ఒక దశ మాత్రమేనని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. విదేశీ పర్యటనల్లో విజయవంతమైన భారత ఓపెనర్లలో రాహుల్ ఒకడని ద్రవిడ్ తెలిపాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లో రాహుల్ శతకాలు బాదాడు. అందుకని మేము అతడికి మద్దతు ఇస్తూనే ఉంటామని వెల్లడించాడు. కేఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతున్నాడు. గత రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను 38 రన్స్ మాత్రమే చేశాడు. గతేడాది కూడా రాహల్ ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు. 8 ఇన్నింగ్స్‌ల్లో ఒక ఫిఫ్టీతో 137 పరుగులు సాధించాడు. రాహుల్ ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో తన ఆటతీరుతో గిల్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ తో కలిసి మంచి శుభారంభాన్ని నెలకొల్పాడు.