ఆసియా కప్‌‌కు ద్రవిడ్ దూరం ?

ఆసియా కప్‌‌కు ద్రవిడ్ దూరం ?

భారతదేశంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. భారత క్రికట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డారు. ఆసియా కప్ 2022కు ముందు ఆయనకు కరోనా సోకడంతో ఆయన వెళుతారా ? లేదా ? ప్రధాన కోచ్ లేకుండానే జట్టు యూఏఈకి వెళుతుందా ? అనేది తెలియరావడం లేదు. యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగనుంది. ఇక్కడకు వెళ్లే ముందు నిర్వహించిన పరీక్షల్లో ద్రవిడ కు కరోనా ఉన్నట్లు తేలింది. ఆగస్టు 28వ తేదీన పాకిస్థాన్ తో భారత టీం తలపడనుంది.

అప్పటి వరకు ఆయన కోలుకుంటారని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. జింబాబ్వే మూడు వన్డేల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు సెలక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల భారత జట్టును ఆసియా కప్ కోసం ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టె్న్ గా నియమించింది. ద్రవిడ్ అందుబాటులో లేకపోతే.. ఆసియా కప్ లోనూ కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.