
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారిని అమరులుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘‘పహల్గాం టెర్రర్ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. బాధితులకు అమరవీరుల హోదా ఇవ్వాలనే వారి డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నాను.
కుటుంబసభ్యులను కోల్పోయి విషాదంలో ఉన్న వారి మనోభావాలను గౌరవించాలని ప్రధానిని అభ్యర్థిస్తున్నాను”అని ఆయన పేర్కొన్నారు.