పీఎం మోదీ ఆఫీసుకు రాహుల్​గాంధీ

పీఎం మోదీ ఆఫీసుకు రాహుల్​గాంధీ
  • సీబీఐ కొత్త చీఫ్​ ఎంపిక మీటింగ్​కు హాజరు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫీసుకు లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెళ్లారు. సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన  నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ మీటింగ్​లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పదవీ కాలం ఉండే సీబీఐ డైరెక్టర్ ఎన్నికకు ఈ కమిటీ సమావేశం చాలా కీకమైంది. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ సిఫార్సుల మేరకు సీబీఐ కొత్త చీఫ్‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. సీబీఐ ప్రస్తుత చీఫ్​ప్రవీణ్​సూద్ పదవీకాలం 2025 మే 25న ముగియనుంది.