రాహుల్ న్యాయ్ యాత్ర అప్డేట్ ఇదే..

రాహుల్ న్యాయ్ యాత్ర అప్డేట్ ఇదే..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మణిపూర్ నుంచి నాగలాండ్ వచ్చిన రాహుల్ అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం నుంచి యాత్ర పున:ప్రారంభించారు. నాగాలాండ్​లో రెండ్రోజుల పాటు 5 జిల్లాల్లో 257 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది.

ఆ తర్వాత  అస్సాంకు చేరుకొని అక్కడ 8 రోజుల పాటు 17 జిల్లాల్లో 833 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక్కో రోజు చొప్పున యాత్ర సాగుతుంది. ఇక వరుసగా బెంగాల్​లో 5 రోజుల పాటు 7 జిల్లాల్లో 523 కిలోమీటర్లు.. బిహార్​లో 4 రోజుల పాటు 7 జిల్లాల్లో 425 కిలోమీటర్లు.. జార్ఖండ్​లో 8 రోజుల పాటు 13 జిల్లాల్లో 804 కిలోమీటర్లు.. ఒడిశాలో 4 రోజుల పాటు 4 జిల్లాల్లో 341 కిలోమీటర్లు కొనసాగనుంది.

 చత్తీస్ గఢ్​లో 5 రోజుల పాటు 7 జిల్లాల్లో 536 కిలోమీటర్లు.. యూపీలో 11 రోజుల పాటు 20 జిల్లాల్లో 1,074 కిలోమీటర్లు.. మధ్యప్రదేశ్​లో వారం పాటు 9 జిల్లాల్లో 698 కిలోమీటర్లు సాగుతుంది. చివరగా రాజస్థాన్​లో ఒక రోజు, గుజరాత్, మహారాష్ట్రలో 5 రోజుల చొప్పున ఉంటుంది. మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్ర ముగుస్తుంది. కాగా, ఈ యాత్ర అత్యధికంగా యూపీ​లో 11 రోజుల పాటు 1,074 కిలోమీటర్లు సాగుతుంది.