రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష.. మోడీ పేర్లపై కామెంట్స్ లో సంచలన తీర్పు

రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష.. మోడీ పేర్లపై కామెంట్స్ లో సంచలన తీర్పు

2019లో ప్రధాని మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద కామెంట్లు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల  జైలు శిక్ష విధించింది. పరువు నష్టం కేసులో  ఐపీసీ సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొంది. 

2019లో కర్నాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టులో కేసు వేశారు బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీ. రెండేళ్ల విచారణ తర్వాత.. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే 2023, మార్చి 23వ తేదీ గురువారం.. సూరత్ కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని.. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించిన కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

జైలు శిక్ష తీర్పు సమయంలో కోర్టులోనే ఉన్నారు రాహుల్ గాంధీ. తీర్పుతో షాక్ అయ్యారు. ఇదే సమయంలో బెయిల్ కూడా మంజూరు చేసింది సూరత్ కోర్టు.

రాహుల్ గాంధీకి u/s 499, 500 ఐపీసీ కింద రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆ శిక్షకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అప్పీల్ మేరకు కోర్టు అతనికి 30 రోజుల బెయిల్‌ ను మంజూరు చేసింది. అప్పటి వరకు ఈ శిక్షను కోర్టు తాత్కాలికంగా నిలిపివేయనుంది.

- కేతన్ రేషమ్‌వాలా, పూర్ణేష్ మోడీ తరఫు న్యాయవాది