15 రోజుల మోదీ పాలనలో ఇన్ని అరాచకాలా : రాహుల్ గాంధీ

15 రోజుల మోదీ పాలనలో ఇన్ని అరాచకాలా : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై ఎమర్జెన్సీ దాడి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రేపటితో(జూన్25)  ఇందిరాగాంధీ ఎమర్జెనీకి 50 యేళ్లు నిండుతా యని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రాహుల్ గాంధీ.. 15 రోజుల ఎన్డీయే పాలనలో భయంకరమైన విధ్వంసం జరిగిందన్నారు. 

ఈ పదిహేను రోజులు భయంకరమైన రైలు ప్రమాదాలు, కాశ్మీర్ లో తీవ్రవాద దాడులు, NEET స్కామ్, NEET PG పరీక్ష రద్దు, పేపర్ లీకులు, పాలు, పప్పులు, గ్యాస్, టోల్ రేట్లు భారీగా పెరిగాయన్నారు. నీటి సంక్షోభం, హీట్ వేవ్ లో ఏర్పాట్లు చేయకపోవడం మరణాలు వంటి దారుణాలు మోదీ పాలనలో జరిగాయన్నారు. ఇవన్నీ నుంచి తప్పించుకునేందుకు , తమ ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు మోదీ బిజీగా ఉన్నారు. 

రాజ్యాంగంపై మోదీ , ఆయన ప్రభుత్వం చేసిన దాడి మాకు మేం సహించడం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రజల గొంతుగా , బలమైన ప్రతిపక్షంగా మోదీ ప్రభుత్వం పోరాడుతామన్నారు. జవాబుదారీ తనం లేని మోదీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.