గ్యాస్ లీక్ ఘటనపై రాహుల్ దిగ్భ్రాంతి

గ్యాస్ లీక్ ఘటనపై రాహుల్ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చేరినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేతలను కోరారు. ‘‘వైజాగ్ గ్యాస్ లీక్ గురించి విని షాక్ అయ్యాను. బాధితులకు అవసరమైన సాయం అందించాలని ఆ ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతున్నాను. చనిపోయినవారి కుటుంబాలకు నా సంతాపం. ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నవారు త్వరగా కోలుకోవాలి”అని రాహుల్ ట్వీట్ చేశారు. విశాఖపట్నం దగ్గర్లో ఆర్ఆర్ వెంకటాపురంలోని ఒక రసాయన కర్మాగారం నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఆరుగురు చనిపోయారు. 100 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు.