
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ వాయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి పోటీచేయబోతున్న ఆయన… ఇవాళ వాయనాడ్‌లో ఉదయం 11:30 గంటలకు తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు నామినేషన్ వేసేందుకు తన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో సహ వాయనాడ్ చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో సహ రోడ్ షో నిర్వహించిన అనంతరం రాహుల్ గాంధీ ఎన్నికల కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు.