ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ.. సడెన్ విజిట్తో అందరికీ షాక్

ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ.. సడెన్ విజిట్తో అందరికీ షాక్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీని సడెన్ గా విజిట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. శుక్రవారం (మే 23) అనధికారికంగా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఆఫీస్ కు (DUSU) వెళ్లారు. అక్కడ విద్యార్థి సంఘం నాయకులను, విద్యార్థులతో పలు సమస్యలపై చర్చించారు. 

యూనివర్సిటీలో ముందుగా నార్త్ క్యాంపస్ లో ఉన్న DUSU కార్యాలయంలో  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులతో రాహుల్ సమావేశం అయ్యారు. విద్యార్థులను సమానంగా చూస్తున్నారా.. ఏదైనా వివక్ష ఎదుర్కొంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా అకడమిక్ పరంగా ఏవైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అని ఆరా తీశారు.

రాహుల్ గాంధీ అనధికారికంగా యూనివర్సిటీని విజిట్ చేయడంపై కొందరు అధికారులు అభ్యంతరం తెలిపారు. అదే సమయంలో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది.

రాహుల్ గాంధీ శుక్రవారం (మే 23) ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా యూనివర్సిటీకి వచ్చారు. ఒక గంటపాటు విద్యార్థులతో సమావేశమయ్యారని యూనివర్సిటీ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఇలా సడెన్ విజిట్ చేయడం ఇది రెండో సారి అని.. షెడ్యూల్ లేకుండా ఎలా అనుతిస్తామని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ విజిట్ వలన ఏర్పడే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని యూనివర్సిటీ నోట్ రిలీజ్ చేసింది. 

అయితే రాహుల్ గాంధీ రాకను DUSU ప్రసిడెంట్ రొనాక్ ఖత్రి సమర్థించారు. యూనివర్సిటీకి రావడానికి రాహుల్ గాంధీకి ప్రత్యేక పర్మిషన్ అవసరం లేదని అన్నారు. చట్టబద్ధంగా ఎన్నికలైన నాయకుడు యూనివర్సిటీలోకి రావటానికి పర్మిషన్ ఏంటని ప్రశ్నించారు. యూనివర్సిటీ ప్రాక్టర్ నోట్ రిలీజ్ చేయడం రాజకీయ ప్రేరేపితం అని ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.