
సమాజాన్ని వేగంగా డెవలప్ చేసే శక్తి ఒక్క విద్యకే ఉందన్నారు రాహుల్ గాంధీ. దేశానికి ఇంగ్లీషు విద్య ఇప్పుడుచాలా అవసరం.. దళిత, ఆదివాసీ పిల్లలు ఇంగ్లీషులో చదవాల్సిన టైం వచ్చిందన్నారు. ఇంగ్లీషు తోపాటు ప్రాంతీయ భాషలు కూడా ముఖ్యమే అన్నారు రాహుల్ గాంధీ.
బీజేపీ నేతలు ఇంగ్లీషు వద్దంటున్నారు.. వారి పిల్లలు ఏం మీడియంలో చదువుతున్నారో నిలదీయాలన్నారు రాహుల్ గాంధీ. వెనకబడిన వర్గాల పిల్లలు ఇంగ్లీషు చదవకూడదా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
ALSO READ | మోడీ బీసీ కాదు కన్వర్టెడ్ ఓబీసీ.. ఆయన బీసీలకు ఏం చేయరు: సీఎం రేవంత్
తెలంగాణలో కులగణన చాలా స్పూర్తిదాయకంగా నిర్వహించారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉంది.. కుల గణన నిర్వహణకు ఓ మార్గదర్శకం అన్నారు. కులగణన సక్సెస్ లో నిపుణుల కమిటీ పాత్ర అద్భుతం అన్నారాయన.
సరైన డేటా మన చేతిలో ఉంటే ఏదైనా చేయగలం.. ఇప్పుడు తెలంగాణ చేతిలో సంపూర్ణమైన డేటా ఉంది..తెలంగాణ అభివృద్దికి ఇది ఎంతో తోడ్పడుతుందన్నారు రాహుల్.
కులగణన నిర్వహించడం బీజేపీ సర్కర్ ఇష్టపడదు.. దేశ ముఖచిత్రాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ ఇష్టపడదన్నారు రాహుల్ గాంధీ.