పార్లమెంట్‌కు సైకిల్‌ మీద రాహుల్.. పెట్రో రేట్లపై నిరసన

పార్లమెంట్‌కు సైకిల్‌ మీద రాహుల్.. పెట్రో రేట్లపై నిరసన

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లారు. పెరుగుతున్న పెట్రో ధరలపై నిరసనలను తెలపడంలో భాగంగా ఆయన సైకిల్‌ తొక్కుకుంటూ పార్లమెంట్‌కు వెళ్లారు. ఆయనతోపాటు 17 ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్‌కు వెళ్లడం గమనార్హం. ఈ ర్యాలీకి ముందు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు కలసి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించాయి. ఇందులో పెరుగుతున్న ఫ్యుయల్ రేట్లు, పెగాసస్ స్పైవేర్‌‌ వివాదం‌తోపాటు కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు, అగ్రి చట్టాల రద్దుపై రైతుల డిమాండ్లు లాంటి పలు విషయాలపై చర్చ నిర్వహించాయి. ఈ చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చేయడానికి మనం ప్రయత్నించాలి. పార్లమెంట్‌కు సైకిల్‌పై మన నిరసనలో ఓ భాగం’ అని పేర్కొన్నారు.