రాహుల్ గాంధీ గురించి ఒబామా కామెంట్స్

రాహుల్ గాంధీ గురించి ఒబామా కామెంట్స్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గురించి యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తన కొత్త పుస్తకంలో ప్రస్తావించారు. ‘రాహుల్ గాంధీ కొంచెం నిరుత్సాహంగా కనిపిస్తారు. తన నైపుణ్యంపై ఆయన కొంత నెర్వస్‌గా ఉంటారు. పని పూర్తి చేసి టీచర్ మెప్పు పొందాలని ఒక విద్యార్థి ఎలా ఆరాటపడతారో రాహుల్ అలా కనిపిస్తారు. అయితే ప్రావీణ్యం సంపాదించాలనే తపన మాత్రం రాహుల్‌‌లో లేదు. ఆయనలో స్పష్టత, ధైర్యం కొరవడ్డాయి’ అని ది ప్రామిస్డ్ ల్యాండ్ అనే సదరు పుస్తకంలో ఒబామా రాసుకొచ్చారు. అంతేగాక ఈ పుస్తకంలో రాహుల్‌తోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూడా ఒబామా ప్రస్తావించారు. ఈ నెల 17న ఈ పుస్తకం మార్కెట్‌‌‌లో అందుబాటులోకి రానుంది.