భారత రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ

భారత రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ

భారత రెజ్లర్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు.   హర్యానాలోని బహదూర్‌ఘర్‌లోని ఛరా గ్రామంలో ఆయన రెజ్లర్లను కలసి సంఘీబావం తెలిపారు.  ఈ  సందర్భంగా రాహుల్ కు బజరంగ్ పునియా వారి సమస్యలను తెలిపారు.  వారి సమస్యలు విన్న రాహుల్ ఓదార్చారు. దేశమంతా రెజ్లర్లకు అండగా ఉంటుందని దైర్యం చెప్పారు.   

రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా కొత్త ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సన్నిహితుడు సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపికయ్యారు. ఇది రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. సంజయ్‌ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా.. బజ్‌రంగ్‌ పునియా, వీరేందర్‌ యాదవ్‌ పద్మశ్రీ అవార్డులను వాపస్‌ చేశారు. ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేశ్‌ ఫొగాట్ ప్రకటించారు.  ఈ క్రమంలో రాహుల్ గాంధీ వారికి మద్దతు తెలిపారు.