57వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

57వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 57వ రోజు కొనసాగుతోంది. ఈ రోజు రుద్రారం గణేష్ మందిర్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. సంగారెడ్డిలోని హనుమాన్ నగర్ ఆర్యన్ గార్డెన్ వరకు కొనసాగనుంది. సాయంత్రం 4గంటలకు తిరిగి శిల్పారామం ఫంక్షన్ హాల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ కానుంది. 

57వ రోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ యాత్ర శివంపేట వరకు కొనసాగనుంది. రాత్రి 7 గంటలకు శివాలయం ఆర్చి వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని సుల్తాన్ పూర్ గ్రామంలో నైట్ హాల్ట్ చేయనున్నారు. రాహుల్ గాంధీ రేపు పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. తిరిగి 5వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర కొనసాగించనున్నారు.