ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్

ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్

కాంగ్రెస్ కు ఐటీ శాఖ రూ. 1823 కోట్లు  చెల్లించాలంటూ నోటీసులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు.  ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం..మళ్లీ ఇలా చేయడానికి ధైర్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటాం..ఇది నా హామీ అని రాహుల్ ట్వీట్ చేశారు.

 బీజేపీ ట్యాక్స్ టెర్రరిజమ్ కు పాల్పడుతోందని..తమను ఆర్థికంగా దెబ్బదీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు రాహుల్. బీజేపీ కూడా ఎన్నో ఉల్లంఘనలకు  పాల్పడిందని ఆరోపించారు. ఆ పార్టీపై ఉన్న రూ. 4600 కోట్ల పెనాల్టీలకు సంబంధించి కూడా ఐటీ శాఖ నోటీసులిచ్చి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని డిమాండ్ చేశారు.  ఐటీ శాఖలు వంటివి బీజేపీ ఆదేశాలతోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు.

2017-18, 2020-21  సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు ఐటీ రూ.1,823 కోట్ల డిమాండ్‌ చేస్తూ  నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.