వార్తలు రాయడానికి జర్నలిస్టులు భయపడుతున్నారు

వార్తలు రాయడానికి జర్నలిస్టులు భయపడుతున్నారు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నాశనం చేస్తోందని రాహుల్ విమర్శించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పార్లమెంట్ లో చర్చించడానికి సర్కార్ అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. వాస్తవాలను ప్రచురిస్తే తమ ఉద్యోగాలు పోతాయేమోనని జర్నలిస్టులు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్.. కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కశ్మీరులో ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరపాలన్నారు.