ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు.. మాట్లాడేందుకు టైం ఇవ్వండి: రాహుల్

ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు.. మాట్లాడేందుకు టైం ఇవ్వండి: రాహుల్

లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఎన్నికైన ఓంబిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్..గతంలో కంటే ఈ సారి సభలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. సభలో తమ గొంతు వినిపించేందుకు  స్పీకర్  సహకరించాలని కోరారు. సభలో మాట్లాడటానికి ప్రతిపక్షాలకు సమయం ఇవ్వాలన్నారు.  సభలో విపక్షాల గొంతు నొక్కితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని..సభ సజావుగా నడిచినట్లు కాదని సూచించారు.  ప్రజల గొంతుకు ఎంత సమర్థవంతంగా  వినిపించామన్నదే ముఖ్యమన్నారు రాహుల్.

ఓం బిర్లా చరిత్ర: మోదీ

ఓం బిర్లాను స్పీకర్ గా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.   గత ఐదేళ్లు ఓం బిర్లా సభను సమర్థవంతంగా నడిపారని చెప్పారు.   వరుసగా రెండోసారి స్పీకర్ గా ఎన్నికై ఓం బిర్లా చరిత్ర సృష్టించారని అన్నారు. వచ్చే ఐదేళ్లు ఓం బిర్లా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నాట్లు తెలిపారు. సభలో  సభ్యులకు మార్గనిర్దేశకం చేస్తారని  ఆశిస్తున్నానని చెప్పారు.  కొత్త ఎంపీలకు ఓంబిర్లా  స్పూర్తిగా నిలుస్తారని.. సభను సరైన మార్గంలో నడపడంలో స్పీకర్ ది కీలక పాత్ర అని అన్నారు మోదీ. 

లోక్ సభ స్పీకర్ గా ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్  మహతాబ్  ప్రకటించారు. మూజువాణి ఓటుతో  ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. ఓం బిర్లాను ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అభినందనలు తెలిపారు.   ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికవడం ఇది వరుసగా రెండోసారి.