రాహుల్‌ గాంధీకి దేశాన్ని నడిపించేంత నిలకడ లేదు

రాహుల్‌ గాంధీకి దేశాన్ని నడిపించేంత నిలకడ లేదు

పూణె: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీలో దేశాన్ని నడిపించే నిలకడ కొరవడిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. రాహుల్‌‌లో నిలకడ ఉందని ప్రజలు భావించడం లేదన్నారు. రాహుల్ గాంధీ గురించి తన బయోగ్రఫీ పుస్తకంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పవార్ స్పందించారు. ‘మన దేశ నాయకత్వం గురించి నేనేదైనా వ్యాఖ్యానించొచ్చు. కానీ వేరే దేశ లీడర్‌‌షిప్ గురించి నేను కామెంట్ చేయబోను. ఎవరైనా సరే దీన్ని విస్మరించొద్దు. నాకు తెలిసి ఒబామా ఆ హద్దును దాటారు’ అని పవార్ పేర్కొన్నారు.