జమిలి ఎన్నికలంటే రాష్ట్రాలపై దాడే: రాహుల్ గాంధీ

జమిలి ఎన్నికలంటే రాష్ట్రాలపై దాడే: రాహుల్ గాంధీ

రాష్ట్రాలపై బీజేపీ సర్కార్ జమిలి ఎన్నికల రూపంలో దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జమిలి ఎన్నికల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్రం కమిటీ వేయడంతో రాహుల్ ఈ అంశంపై ట్విటర్ వేదికగా స్పందించారు. 

ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటే రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనన్నారు. ఇండియా అంటే రాష్ట్రాల సమాహారం అని పేర్కొన్నారు.  జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు స్థానం కల్పించకపోవడంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.