రాహుల్ గాంధీకి స్వల్ప అస్వస్థత

రాహుల్ గాంధీకి స్వల్ప అస్వస్థత

న్యూఢిల్లీ :  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే రాంచీలో నిర్వహించిన ఇండియా కూటమి ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదని ఆ పార్టీ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ సాత్నాలోని బహిరంగ సభలో కూడా రాహుల్ ప్లేస్​లో ఖర్గే పాల్గొంటారని చెప్పారు. ఢిల్లీ నుంచి రాహుల్ బయటికొచ్చే పరిస్థితి లేదన్నారు.

ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ కారణంగా రాహుల్‌‌‌‌ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. కాగా, రైల్వే వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులపై ట్విట్టర్ ​వేదికగా మోదీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ ప్రభుత్వం రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. బీజేపీ హయాంలో రైలు ప్రయాణం శిక్షగా మారింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విలాస‌‌‌‌వంత‌‌‌‌మైన రైళ్లను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం సామాన్యులు ప్రయాణించే రైళ్లలోని జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ కోచ్‌‌‌‌ల సంఖ్యను తగ్గిస్తున్నది. బాత్రూమ్​లలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. రైల్వే వ్యవస్థను మోదీ తన ఫ్రెండ్స్​కు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’’అని ఆరోపించారు.