- నాకు ప్రజలే పరమాత్మ
- మీరేం చెబితే దానికి కట్టుబడి ఉంటా
- వయనాడ్, రాయబరేలీలో దేన్ని నిలబెట్టుకోవాలో అర్థ కావడం లేదు
- నేను సామాన్య మనిషిని.. మోదీలా నాకు పరమాత్మ మార్గనిర్దేశం చేయరు..
- దేశ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారు
- వయనాడ్ లో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ
వయనాడ్: 'ప్రధాని నరేంద్ర మోదీ తనకు పరమాత్మ మార్గనిర్దేశం చేస్తున్నారని చెప్పారు. కానీ నేను సాధారణ మనిషిని, నాకు ప్రజలే పరమాత్మ.. ప్రజలు ఏం చెబితే దానికి కట్టుబడి ఉంటా’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. 2024,. జూన్ 12వ తేదీన కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన మలప్పురంలోని ఎడవన్నలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.
వయనాడ్, రాయబరేలీలో ప్రజలు తనను అఖండ మెజార్టీతో గెలిపించారని, దేనిని నిలబెట్టుకోవాలో అర్థం కావడం లేదని, రెండు నియోజకవర్గాల ప్రజలను సంతోషపెట్టే నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. యూపీలో బీజేపీ పనైపోయిందని చెప్పారు. రాజ్యాంగానికి ప్రజలే రక్షకులని అన్నారు.
ఎన్నికల ముందు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత రాజ్యాంగం ముందు ప్రధాని నమస్కరించడం మీరు చూశారని అన్నారు. దేశ ప్రజలు ప్రేమ, ఆప్యాయతలతో ద్వేషాన్ని ఓడించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వీడీ సతీశన్, రమేష్ చెన్నితాల, ఎంఎం హసన్, యూడీఎఫ్ ఇతర నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.