మహిళ రిజర్వేషన్లు ఓకే.. కానీ అది అసంపూర్ణం: రాహుల్ గాంధీ

మహిళ రిజర్వేషన్లు ఓకే.. కానీ అది అసంపూర్ణం: రాహుల్ గాంధీ

లోకసభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపారు. అదే సమయంలో ఈ బిల్లు అసంపూర్తిగా ఉందని.. ఈ బిల్లులో ఓబీసీల ప్రస్తావన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ మహిళల విషయంలో ముందడుగు అన్నారాయన. సభలోని సభ్యులందరూ దాని ప్రాముఖ్యతను అంగీకరించాలన్నారు రాహుల్ గాంధీ 

‘‘అయితే మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళల రిజర్వేషన్ గురించి ప్రస్తావన లేదని.. అందుకే ఈ బిల్లు అసంపూర్తిగా ఉందని నేను భావిస్తున్నాని రాహుల్ అన్నారు.  దేశంలో ప్రతి మహిళకు రిజర్వేషన్లు అందేలా చూడటం చాలా ముఖ్యమని’’ నొక్కి చెప్పారు రాహుల్ గాంధీ.

మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కొత్త జనాభా లెక్కలు, డీలిమిటేషన్ అవసరమని కేంద్రం ప్రకటించడం పట్ల రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు విషయాల నాకు వింతగా అనిపించాయన్నారు రాహుల్.