రాహుల్ ఈడీ విచారణ: రాష్ట్రపతిని కలవనున్న కాంగ్రెస్ నేతలు

రాహుల్ ఈడీ విచారణ: రాష్ట్రపతిని కలవనున్న కాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని  ప్రశ్నించనుంది. మనీలాండరింగ్ కేసులో రాహుల్ ఇవాళ ED  ముందు హాజరుకానున్నారు. మరో వైపు రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్ణయించారు.  ఇవాళ(సోమవారం) సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. మూడు రోజుల టైం కోరారు రాహుల్. తన తల్లి సోనియా గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని.... ఈ నెల 20న విచారణకు హాజరయ్యేలా మినహాయింపు కోరారు.  మరోవైపు ఈడీ విచారణను నిరసిస్తూ..... కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన తెలుపనుంది. రాజకీయ దాడులు, అగ్నిపథ్ కు వ్యతిరేకంగా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుత నిరసనలు కొనసాగిస్తారని.. ట్వీట్ చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. నేషనల్ హెరాల్డ్ మనీలాండరిగం కేసులో ఇప్పటికే మూడ్రోజుల్లో 30 గంటల పాటు రాహుల్ ని ప్రశ్నించారు ఈడీ అధికారులు.