ఫిక్స్..అమేథీ నుంచే రాహుల్ గాంధీ పోటీ!

ఫిక్స్..అమేథీ నుంచే రాహుల్ గాంధీ పోటీ!

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్ వెల్లడించారు.   ఢిల్లీలో సమావేశం అనంతరం ప్రదీప్ సింఘాల్ మాట్లాడుతూ అమేథీ నుంచి పార్టీ అభ్యర్థిగా గాంధీ ఉంటారని, ఆయన పేరును అధిష్టానం త్వరలో ప్రకటిస్తుందని చెప్పారు. రాహుల్  గాంధీ 2002 నుండి 2019 వరకు అమేథీకి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వాయనాడ్‌ నుంచి ఎంపీగా ఉన్నారు. 

1967లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి అమేథీ ఉత్తరప్రదేశ్‌లో బలమైన కోటగా ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ 1977లో అమేథీ నుంచి తొలిసారి పోటీ చేసి ఎమర్జెన్సీ కారణంగా ఓటమిని చవిచూశారు. 1980లో  అక్కడి నుంచి పోటీ చేసి మళ్లీ గెలిచారు.  ఆ తరువాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించి 1981లో అమేథీ నుండి పోటీ చేసి 1984, 1989, 1991 వరకు అక్కడి నుంచే ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.  

1999లో సోనియా గాంధీ  కూడా అమేథీ నుంచి పోటీ చేసి గెలిచారు.  అయితే 2004లో ఆమె తన నియోజకవర్గాన్ని రాయ్‌బరేలీకి మార్చుకున్నారు, గతంలో ఈ స్థానం నుంచి ఫిరోజ్ గాంధీ, ఆ తర్వాత ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2004లో తొలిసారి  అమేథీలో గెలిచారు.   2009, 2014లో తిరిగి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. కానీ కేరళలోని వాయనాడ్‌ నుంచి ఎంపీగా గెలిచారు.