ఏప్రిల్ 10న అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్

ఏప్రిల్ 10న అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలో దిగుతున్నారు. కేరళ వయనాడ్ నుంచి ఆయన గురువారం నామినేషన్ వేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ, చెల్లెలు ప్రియాంకాగాంధీ వాద్రాతో పాటు.. ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు రాహుల్. ఇపుడు అమేథీ నుంచి నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు.

ఏప్రిల్ పదో తేదీ బుధవారం నాడు అమేథీ నుంచి నామినేషన్ పత్రాలు అధికారులకు ఇవ్వనున్నారు రాహుల్ గాంధీ. ఏప్రిల్ 11న యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ .. రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేస్తారు.