ఈ బడ్జెట్తో పేద, మధ్యతరగతికి ఒరిగిందేమీ లేదు

ఈ బడ్జెట్తో పేద, మధ్యతరగతికి ఒరిగిందేమీ లేదు

న్యూఢిల్లీ: కేంద్రం తాజాగా విడుదల చేసిన బడ్జెట్ పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ చాలా నిరాశపరిచిందన్నారు. ఇందులో ఖచ్చితంగా ఏమీ లేదని తెలుస్తుందన్నారు. ఈ బడ్జెట్ లో వేతన జీవులు, పేద, మధ్యతరగతి ప్రజలకు కేటాయించిందేమీ లేదన్నారు. అణగారిన వర్గాలు, యువత, రైతులు, ఎంఎస్ఎంఈలకూ ఈ బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. 

కాగా, కేంద్ర బడ్జెట్ పై పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగుతున్నారు. ఈ బడ్జెట్ ‘అచ్ఛే దిన్’ అనే ఎండమావిని మరింత దూరం చేసేలా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కామెంట్ చేశారు. 'అచ్ఛే దిన్' రావడానికి మనం మరో 25 సంవత్సరాలు వేచి ఉండాలని ఎద్దేవా చేశారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించినంత వరకు, ప్రభుత్వం ఆ దిశగానే వెళ్తోందని చాలా స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. బడ్జెట్‌లో సాధారణ పౌరులకు పదార్ధాల కొరత గురించి తాము మరింత ఆందోళన చెందుతున్నామని థరూర్ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి ప్రసంగం విన్నప్పుడు, MGNREG, రక్షణతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర అత్యవసర ప్రాధాన్యతల గురించి ప్రస్తావించలేదన్నారు. ప్రస్తుతం మనం భయంకరమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

అచ్ఛే దిన్ కోసం మరో 25 ఏళ్లు వేచి చూడాలి

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త

ఫిట్నెస్ మెరుగుపర్చుకోకుంటే హిట్మ్యాన్కు కష్టం