వంద రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ భారత్ జోడో యాత్ర  

వంద రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ భారత్ జోడో యాత్ర  

రాహుల్  చేపట్టిన  భారత్ జోడో యాత్ర  ఇవాళ్టితో  100 రోజులు  పూర్తి చేసుకుంది. రాజస్థాన్ లో పాదయాత్ర  కొనసాగుతోంది.  దౌసా నుంచి రాహుల్ పాదయాత్రను  ప్రారంభించారు. పార్టీ నేతలు,  కార్యకర్తలు   రాహుల్ పాదయాత్రలో  పాల్గొన్నారు.  సెప్టెంబర్ 7న  కన్యాకుమారిలో రాహుల్  పాదయాత్రను   ప్రారంభించారు .  ఇప్పటి వరకు  8 రాష్ట్రాల్లో  పాదయాత్ర పూర్తి చేశారు. మరో  నాలుగు రాష్ట్రాల్లో  పాదయాత్ర చేయనున్నారు.  ఇప్పటి వరకు  మొత్తం 2800  కిలోమీటర్లు  పాదయాత్ర చేశారు.



పాదయాత్రలో  రాహుల్  అన్ని వర్గాల  ప్రజలను  పలకరిస్తూ  పేదల సమస్యలు తెలుసుకుంటున్నట్లు  కాంగ్రెస్ నేతలు  తెలిపారు. ఇప్పటి వరకు  తమిళనాడు, కేరళ,  కర్ణాటక, ఏపీ, తెలంగాణ,  మహారాష్ట్ర,  మధ్య ప్రదేశ్ లో  రాహుల్ పాదయాత్రను  పూర్తి చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,  హరియాణా,  పంజాబ్ రాష్ట్రాల్లో  పాదయాత్ర చేయనున్నారు.  జమ్మూ కశ్మీర్ లో రాహుల్  పాదయాత్ర  ముగియనుంది.  మొత్తం 3 వేల  500 కిలోమీటర్ల  మేర  పాదయాత్ర చేసేందుకు  లక్ష్యంగా పెట్టుకున్నారు  రాహుల్.  బీజేపీ విధానాలకు  వ్యతిరేకంగా  ప్రజలను ఏకం చేసేందుకు  పాదయాత్ర చేస్తున్నట్లు  రాహుల్ తెలిపారు.  రాహుల్ చేస్తున్న యాత్రకు  పలువురు  మద్దతుగా పాదయాత్రలో  పాల్గొంటున్నారు.