
న్యూఢిల్లీ: 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలను భారత రాజకీయాల్లో టెక్టోనిక్ షిఫ్ట్ గా అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పీఎం మోదీ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కోసం కష్టాలు పడుతోందని అన్నారు రాహుల్ గాంధీ. మోదీ శిబిరంలో ఎంపీలు పార్టీ ఫిరాయింపులు అవకాశం ఉందని అన్నారు. బీజేపీ విభజన రాజకీయా లకు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు రాహుల్ గాంధీ.
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 543 సీట్లలో అంచనాలకు మించి 234 స్థానాలను గెలుచు కుం ది. ముఖ్యంగా బీజేపీ కంచుకోట అయిన యూపీలో ఇండియా కూటమి బలమైన శక్తిగా నిలిచిందన్నారు. 15ఏళ్లలో కాంగ్రెస్ అత్యధికంగా 99 స్థానాలను గెలుచు కుంది. అయితే 400 సీట్లు గెలుస్తామన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 293 సీట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చినా.. ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని రాహుల్ అన్నారు.
మోదీ శిబిరంలో అసంతృప్త శగలు రగులుకున్నాయి. పార్టీ ఫిరాయింపులు జరిగొచ్చని కొందరు బీజేపీ ఎంపీలే చెప్పినట్టు రాహుల్ అన్నారు. బీజేపీ ద్వేషాన్ని నింపి, రెచ్చగొట్టి, వాటి ద్వారా ప్రయోజనాలు పొందారు. అందుకే ఈ ఎన్నికలలో భారత ప్రజలు బీజేపీని తిరస్కరించారని రాహుల్ అన్నారు. ముస్లిం సమాజాన్ని చొరబా టుదారులు అని, కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు కేటాయించిన ఉద్యోగాలు , రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ యత్నిస్తుందన్నారు. దీనిని సమర్థవం తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం.. అందుకే బీజేపీ భయంతో భారీ మెజారిటీ నాటకం ఆడిందన్నారు రాహుల్ గాంధీ.
2014,20219 లో ప్రధాని మోదీని గెలిపించిన అయోధ్య ప్రజలు.. 2024 ఎన్నికల్లో మోదీని ఘోరంగా తిరస్కరించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకున్న బీజేపీ పాచిక ఈ ఎన్నికల్లో ఫలించలేదన్నారు రాహుల్ గాంధీ.