అక్టోబర్ 19న కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన

అక్టోబర్ 19న కరీంనగర్ జిల్లాలో రాహుల్  గాంధీ పర్యటన

కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి భూపాలపల్లిలో బస చేసి గురువారం ఉదయం బస్సు యాత్ర ద్వారా పెద్దపల్లి జిల్లా మంథనికి చేరుకుంటారు. మంథనిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ సిటీ శివారులోని ఇరుకుల్ల  బ్రిడ్జి వద్దకు సాయంత్రం చేరుకుంటారు.  

అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి  బైకు ర్యాలీతో బయలుదేరి హౌసింగ్ బోర్డు లోని మారుతి నగర్ చౌరస్తాకు చేరుకుంటారు, మారుతి నగర్ నుంచి ఓపెన్ టాప్ జీపులో బయల్దేరి అశోక్ నగర్ లోని బొమ్మ వెంకన్న చౌరస్తా, పతేపుర మీదుగా రాజీవ్ చౌక్ వద్దకు చేరుకుని కార్నర్ మీటింగు లో మాట్లాడుతారు. అనంతరం రాత్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని, శుక్రవారం ఉదయం నిజామాబాద్ జిల్లా బోధన్ కు  వెళ్తారు.