
త్వరలో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (PSE) నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీ కంటే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకే ఎక్కువ పాపులారీటీ ఉందని తేలింది. ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారంటూ ఇండియా టుడే నిర్వహించిన PSE సర్వేలో SCలు, ముస్లింలలో ఎక్కువగా రాహుల్ గాంధీ వైపే మొగ్గు చూపారు. రాహుల్ ప్రధాని కావాలని 44 శాతం మంది SCలు కోరుకోగా.. 41 శాతం మంది మోడీ మళ్లీ ప్రధాని కావాలని కోరుతున్నారు.
ముస్లింలలో ఏకంగా 61 శాతం మంది రాహుల్ గాంధీ వైపే ఆసక్తి చూపిస్తుండగా.. కేవలం 18 శాతం మంది ముస్లింలు మాత్రమే మోడీ మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. జనవరిలో నిర్వహించిన సర్వే కంటే తాజా సర్వేలో రాహుల్ పాపులారిటీ 4 శాతం పెరిగింది. ఇదే సమయంలో ప్రధాని మోడీ పాపులారీ కేవలం 1% మాత్రమే పెరిగింది. అయితే, అన్ని సామాజికవర్గాల ప్రకారం చూస్తే మోడీ ప్రధాని కావాలని 51 శాతం మంది కోరుకుంటున్నారు. రాహుల్ 33 శాతం పాపులారిటీని సాధించారు.