మే 5, 9వ తేదీల్లో తెలంగాణలో రాహుల్​ టూర్​

మే 5, 9వ తేదీల్లో తెలంగాణలో రాహుల్​ టూర్​
  • నిర్మల్, గద్వాల, కరీంనగర్, సరూర్​నగర్​లో ప్రచారం
  • 6, 7వ తేదీల్లో ఎల్లారెడ్డి, తాండూర్​, నర్సాపూర్​, చేవెళ్లలో ప్రియాంక ప్రచారం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో రాహుల్ టూర్ ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 5వ తేదీన నిర్మల్, గద్వాలలో క్యాంపెయిన్​ చేస్తారు. 9వ తేదీన కరీంనగర్, సరూర్​నగర్​లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. కాగా, ప్రియాంక గాంధీ 6, 7 వ తేదీల్లో ఎన్నికల ప్రచారానికి తెలంగాణకు వస్తున్నారు. ఆమె 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్​లలో ప్రచారం చేపడతారు. 7న నర్సాపూర్​, కూకట్ పల్లిలో ప్రచారం నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, రోడ్​ షోలు ఉంటాయని బుధవారం కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి.