హాస్టల్ లో రాహుల్ పర్యటన.. నోటీసులు పంపిన అధికారులు

హాస్టల్ లో రాహుల్ పర్యటన.. నోటీసులు పంపిన అధికారులు

కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ గత వారం ఢిల్లీ  పీజీ మెన్స్ యూనివర్సిటీలోని హాస్టల్ ని సందర్శించారు. రాహుల్ హాస్టల్ లోకి ప్రవేశించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి భోజనం చేశారు. అనుమతి లేకుండా హాస్టల్ లోకి వెళ్లడంతో నిబంధనలు అతిక్రమించారని యూనివర్సిటీ అధికారులు ఆయనకు నోటీసులు పంపారు. ఇంతకీ నోటీసుల్లో ఏముంది ?

నిబంధనల అతిక్రమణ..

రాహుల్ గాంధీకి పంపిన 2 పేజీల నోటీసుల్లో ఆయన హాస్టల్ లోకి రావడం నిబంధనలను అతిక్రమించడమే అని అధికారులు పేర్కొన్నారు. బాధ్యతా రాహిత్య ప్రవర్తనతో అది సమానమని పేర్కొన్నారు. రాహుల్ మూడు వాహనాలతో కూడిన వాహన శ్రేణితో హాస్టల్ కి వచ్చారని వసతి గృహం నిబంధనలు అతిక్రమించారని వారు ఆరోపించారు. అకాడమీ వ్యక్తులు మినహా మరెవ్వరికి హాస్టల్ లోకి ప్రవేశం ఉండదని చెప్పారు. హాస్టల్ నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఇతర సభ్యులు సైతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని ఖండించారు. అధికారుల అనుమతి లేనిది హాస్టల్ ని విజిట్ చేయడం సరికాదని  రిజిస్ర్టార్ వికాస్ గుప్తా అన్నారు.  మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఇలాంటి ఘటనలు విద్యార్థుల భద్రతకు ప్రమాదంగా మారొచ్చని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పంపిన నోటీసులపై ఎన్ఎస్ యూఐ స్టూడెంట్ విభాగం ఖండించింది. రాహుల్ పై చర్యలు తీసుకోవాలని అధికారుల మీద ఎవరో ఒత్తిడి తెస్తున్నారని ఆ విభాగం ఆరోపించింది. ఈ ఆరోపణల్ని వికాస్ గుప్తా ఖండిస్తూ.. "ఈ అంశంపై యూనివర్సిటీపై ఎవరి ఒత్తిడీ లేదు. క్రమశిక్షణ కు సంబంధించిన విషయం" అని అన్నారు.