హుజూర్ నగర్లో ఎక్సైజ్ అధికారుల దాడులు

 హుజూర్ నగర్లో ఎక్సైజ్ అధికారుల దాడులు

హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు దాడులు నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్ జిన్న నాగార్జునరెడ్డి వివరాల ప్రకారం.. మట్టంపల్లి మండలం కొత్తదొనబండ తండాకు చెందిన బానోత్ రంగా, బానోత్ సోముడు ఆదివారం హనుమంతులగూడెం నుంచి కొత్త దొనబండ తండాకు రెండు ద్విచక్ర వాహనాలపై 10 లీటర్ల నాటు సారా,100 కేజీల బెల్లం తరలిస్తున్నారు. 

ఈ సమయంలో అటుగా వచ్చిన ఎక్సైజ్ అధికారులను చూసి వారు వెహికిల్స్ వదిలేసి పారిపోయారు. సారా, బెల్లంతోపాటు రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మద్యం సీజ్, షాపు యజమానిపై కేసు నమోదు.. 

హుజూర్​నగర్ ​పట్టణంలోని వరలక్ష్మి కూల్ డ్రింక్స్ షాపులో మద్యం అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. షాపులోని 45 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని యజమాని యాతం వరలక్ష్మిపై కేసు నమోదు చేశారు. దాడుల్లో ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి, పోలీసులు నాగరాజు, రవి కుమార్, నవీన్, గోపిరెడ్డి, మణికంఠ పాల్గొన్నారు.