ఫార్మాస్యూటికల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

ఫార్మాస్యూటికల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న బ్లూ జెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ కంపెనీ ఆవరణలో నవంబర్ 3న ఉదయం పేలుడు సంభవించింది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ పేలుడు ధాటికి ఫార్మాస్యూటికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, గ్యాస్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని, ఇది సైట్‌లో నిల్వ చేయబడిన రసాయనాల కారణంగా వరుస పేలుళ్లకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ సంఘటన బ్లూ జెట్ హెల్త్‌కేర్ కంపెనీని కుదిపేసింది. ఆ తర్వాత భీకర మంటలు ప్రాంగణం అంతటా వేగంగా వ్యాపించాయి. మంటల తీవ్రతకు ఘటనా స్థలంలో నిల్వ ఉంచిన రసాయనాలతో కూడిన బారెల్స్‌ పేలిపోయాయి. పలు నివేదికల ప్రకారం, పేలుడు సమయంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ముగ్గురు కార్మికులు ప్రస్తుతం మహద్ రూరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. ఈ విషాద సంఘటనకు సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేసేందుకు పది అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పేశారు. సైట్‌లో ప్రమాదకర రసాయనాలు ఉండటంతో అధికారుల రెస్క్యూ ఆపరేషన్ సంక్లిష్టంగా మారింది. పోలీసులు, అగ్నిమాపక దళం బృందాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) మిస్సయిన కార్మికులను గుర్తించడానికి, నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాయి.