ఉచిత వైఫై కొనసాగిస్తాం: రైల్ టెల్

ఉచిత వైఫై కొనసాగిస్తాం: రైల్ టెల్

రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం..దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందించేందుకు ఐదేళ్ల కిందట గూగుల్ స్టేషన్ పేరుతో గూగుల్ ఓ కార్యాచరణ ప్రకటించింది. భారత్ లో డేటా అత్యంత చవకగా లభిస్తుండటంతో ఫ్రీగా వైఫై అందించే కార్యక్రమానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. అయితే దీనిపై భారతీయ రైల్వే అనుబంధ సంస్థ రైల్ టెల్ స్పందించింది. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై పథకంలో గూగుల్ కేవలం 415 స్టేషన్లలో మాత్రమే భాగస్వామి అని తెలిపింది. గూగుల్ తో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఇందులో భాగస్వాములని, గూగుల్ వెనక్కి తగ్గినా… తాము ఇతర సంస్థల సాయంతో ఉచిత వైఫై అందించే కార్యక్రమం కొనసాగిస్తామని రైల్ టెల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్న రైల్వే స్టేషన్ల సంఖ్య 5,600కి చేరిందని చెప్పింది.