రైల్వే ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ షురూ

రైల్వే ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ షురూ
  • అంఫన్‌ కారణంగా సైట్‌ స్లో
  • ఉదయం 10 గంటలకే స్టార్ట్‌

న్యూఢిల్లీ: జూన్‌ 1 నుంచి రైల్వే సర్తీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని సంబంధించి రిజర్వేషన్లు స్టార్ట్‌ అయ్యాయి. వివిధ రూట్లలో తిరిగే 200 రైళ్లకు రిజర్వేషన్లు స్టార్ట్‌ అయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి ఐఆర్‌‌సీటీసీ ద్వారా బుకింగ్స్‌ స్టార్ట్‌ చేయగా.. కొన్ని చోట్ల సైట్‌లో ప్రాబ్లమ్స్‌ తలెత్తాయి. అందరూ ఒకేసారి లాగిన్‌ అవడం, అంఫాన్‌ తుపాను కారణంగా టెక్నికల్‌ ఇష్యూస్‌ తలెత్తాయని ఐఆర్‌‌సీటీసీ ప్రకటించింది. “ అందరూ పేషన్స్‌తో ఉండండి. ఇష్యూను క్లియర్‌‌ చేసేందుకు ఇండియన్‌ రైల్వే ప్రయత్నిస్తోంది. అందరూ ఒకేసారి లాగిన్‌ అవడం, సైక్లోన్‌ వల్ల ఇష్యూస్‌ వచ్చాయి” అని రైల్వే అధికారి చెప్పారు. కాగా.. రిజర్వేషన్లు షురూ అయిన కొద్దిసేపటికే టికెట్లన్నీ సేల్‌ అయిపోయి వెయింటింగ్‌ లిస్ట్‌కు చేరుకున్నాయి. కేటాయించిన టికెట్లు పూర్తైన తర్వాత 200 వరకు మాత్రమే వెయిటింగ్‌ లిస్ట్‌ కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో నడిపిన ప్రత్యేక రైళ్లలో కేవలం ఏసీ బోగీలనే అనుమతించిన రైల్వే అధికారులు ప్రస్తుతం స్పీపర్‌‌ బోగీల్లో రిజర్వేషన్లను అనుమతించారు. కేవలం ఆన్‌లైన్‌లో ఐఆర్‌‌సీటీసీ ద్వారా లేదా యాప్‌ ద్వారానే టికెట్లు బుక్ చేసుకునేందుకు అనుమతిచ్చారు. ట్రైన్‌ టైమింగ్స్‌, స్టాప్స్‌ గతంలో లాగానే ఉంటాయని రైల్వే శాఖచెప్పింది.

రైళ్ల వివరాలు ఇవే: