మల్కాజిగిరిలో రైల్వే ఉద్యోగి దారుణ హత్య

V6 Velugu Posted on May 08, 2021

హైదరాబాద్: రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ రెడ్డి దారుణ హత్య కు గురయ్యాడు. తన తల్లిదండ్రులు ఇద్దరికీ కరోనా సోకడంతో రైల్వే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు. శనివారం గుర్తు తెలియని దుండగుడు కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో మెడ మీద నరికి చంపి పరారయ్యాడు. చనిపోయిన విజయ్ కుమార్ రెడ్డి కి  బాగా పరిచయం ఉన్న వ్యక్తి  అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  పాత కక్షలే కారణమా లేక వేరే యేదైనా వ్యవహారంలో తత తేడా రావడం వల్ల హత్యకు దారితీసిందా విచారణలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tagged , hyderabad murder, railway employee murder, malkajgiri new mirjalguda murder, employee vijaykumar reddy

Latest Videos

Subscribe Now

More News