
సికింద్రాబాద్: వర్షాల కారణంగా ఆదివారం ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫలక్నుమా–-లింగంపల్లి రూట్లో 6, లింగంపల్లి –- ఫలక్నుమా రూట్లో 7, రామచంద్రాపరం-– ఫలక్నుమా, ఫలక్నుమా– -హైదరాబాద్మధ్య నడిచే ఒక్కో సర్వీసును రద్దు చేశామన్నారు. సోమవారం నుంచి తిరిగి యధావిధిగా నడుస్తాయన్నారు.