రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. మొత్తం 11,127 ఖాళీలు.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్...

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. మొత్తం 11,127 ఖాళీలు.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్...


రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్​పీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మే 15న ప్రారంభమై జూన్ 16న ముగుస్తుంది. 

పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్.

మొత్తం పోస్టులు: 11,127. (అన్ రిజర్వ్డ్ 4860, ఎస్సీ 1476, ఎస్టీ 919, ఓబీసీ 2598, ఎక్స్ సర్వీస్ మన్ 1004). సికింద్రాబాద్ జోన్ పరిధిలో మొత్తం 1420 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అన్ రిజర్వ్డ్ 625, ఎస్సీ 209, ఎస్టీ 102, ఓబీసీ 390, ఈడబ్ల్యూఎస్ 94, ఎక్స్ సర్వీస్ మన్​ 143.  

ఎలిజిబిలిటీ
ఆప్షన్– ఏ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో & టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్‌మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ & కాయిల్ వైండర్, మెకానిక్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజరేషన్ & ఎయిర్ -కండిషనింగ్ మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ చదివి ఉండాలి. అప్రెంటిస్‌షిప్  పూర్తిచేసి ఉండాలి.

ఆప్షన్–బి: గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదో తరగతి/ సమాన అర్హత కలిగి ఉండాలి. మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ ఇంజినీరింగ్​లో మూడేళ్ల  డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 
వయోపరిమితి (2026, జులై 1 నాటికి):18 నుంచి 30 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్​మన్​లకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

రైల్వే స్టాఫ్ (గ్రూప్– సి/ డి) ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు (జనరల్), 43 ఏళ్లు (ఓబీసీ), 45 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీలకు). 
వితంతు/ విడాకులు/ న్యాయబద్దంగా భర్త నుంచి వేరు పడిన మహిళలకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు (జనరల్), 38 ఏళ్లు (ఓబీసీ), 40 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ).

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 15.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మన్, మహిళలు, ట్రాన్స్​జెండర్, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ)లకు రూ.250. మిగతా వారికి రూ.500.

లాస్ట్ డేట్: జూన్ 14. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ rrbapply.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
స్టేజ్–1 ఫస్ట్ స్టేజ్ సీబీటీ (సీబీటీ–1)
ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు–1లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 75 ప్రశ్నలు 75 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్, మెంటల్​ఎబిలిటీ (రీజనింగ్), జనరల్ సైన్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నల కాఠిన్యత పదోతరగతి స్థాయిలో ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

తుది ఎంపిక: సీబీఏటీలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆర్ఆర్​బీల వారీగా తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఇందులో సీబీటీ –2లోని పార్ట్-–ఏ మార్కులకు 50 శాతం, సీబీఏటీ  స్కోర్‌లకు 50 శాతం వెయిటేజ్ ఉంటుంది. ఖాళీల సంఖ్యకు సమానమైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష కోసం షార్ట్​లిస్ట్ చేస్తారు.

స్టేజ్–2 సెకండ్ స్టేజ్ సీబీటీ (సీబీటీ–2) 
సీబీటీ–1లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఆర్ఆర్​బీ నోటిఫై చేసిన ఖాళీల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున సీబీటీ–2కు ఎంపిక చేస్తారు. సీబీటీ–2లో  రెండు పార్టులు ఉంటాయి. 

►ALSO READ | IIT, NIT విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఒరాకిల్.. క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఇచ్చిన ఆఫర్ లెటర్స్ క్యాన్సిల్

పార్ట్–ఏలో 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. ఇందులో ప్రశ్నలు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.  పార్ట్–ఏలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. 

పార్ట్–బీలో 75 ప్రశ్నలు 75 మార్కులకు అడుగుతారు. ఇందులో సంబంధిత ట్రేడు నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇది క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. పార్ట్–బీలో కనీస అర్హత సాధించాలంటే 35 శాతం మార్కులు రావాలి. 

స్టేజ్–3 కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ)
కంప్యూటర్ బేస్ట్ టెస్ట్–2 పార్ట్–ఏలో సాధించిన మార్కుల ఆధారంగా ఏఎల్​పీ ఖాళీలను అనుసరించి కమ్యూనిటీ/ క్యాటగిరీ ఆధారంగా అభ్యర్థులను  కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్టుకు పిలుస్తారు. కేటగిరీతో సంబంధం లేకుండా విడివిడిగా కనీసం42 టీ–స్కోర్ సాధించాల్సి ఉంటుంది. సీబీఏటీ కేవలం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తారు. ఎలాంటి నెగిటివ్ మార్కులు లేవు.