నిరీక్షణకు తెర!..పెంబర్తి రైల్వే గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు 

నిరీక్షణకు తెర!..పెంబర్తి రైల్వే గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు 

జనగామ, వెలుగు : రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్​ కష్టాలకు తెర దించేలా ఆ డిపార్ట్​మెంట్ ప్లాన్​ చేస్తోంది. జనగామ జిల్లా పెంబర్తి రైల్వే స్వేషన్​ వద్ద అండర్​ బ్రిడ్జి నిర్మాణానికి రెడీ అవుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో గేటు వద్ద ట్రాఫిక్ జామ్ కు చెక్​ పడనుంది. సికింద్రాబాద్​-కాజీపేట రైల్వే మార్గంలోని జనగామ జిల్లాలో ఏడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

ఇందులో హస్త కళలకు పేరొందిన పెంబర్తిలో రైల్వే స్టేషన్​ ఇ గ్రేడ్​లో ఉంది. ఈ స్టేషన్​ మీదుగా జనగామ జిల్లాలోనే ఎల్లంల, సిద్దెంకి, పోచన్నపేట మీదుగా సిద్దిపేట వైపునకు వెళ్లే రోడ్డు మార్గం ఉంది. సికింద్రాబాద్ టూ కాజీపేట మార్గంలో రైలు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో పెంబర్తి వద్ద గేటు ఎక్కువగా వేసే ఉంటుంది. స్టేషన్​కు ఒకవైపు క్రషర్లు ఉండడంతో గేటు వేసిన సమయాల్లో ట్రాఫిక్​ నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

జాయింట్ ఇన్​స్పెక్షన్​

ట్రాఫిక్​ ఇబ్బందులను పరిష్కరించడానికి అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా పెంబర్తి (ఎల్​సీ 40) గేటు వద్ద ఓవర్​ బ్రిడ్జిగానీ, అండర్​ బ్రిడ్జిగానీ నిర్మించాలని రైల్వే డిపార్ట్​మెంట్ గతంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రెవెన్యూ, ఇంజినీరింగ్, రైల్వే డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు గతవారం జాయింట్ ఇన్​స్పెక్షన్​ చేశారు. నిర్మాణ సమయంలో ట్రాఫిక్​ ఆగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించారు. కాగా, ఆర్​వోబీ నిర్మాణానికి బడ్జెట్​ ఎక్కువగా అవుతుందని గుర్తించి ఆఫీసర్లు రైల్వే అండర్​ బ్రిడ్జి నిర్మాణానికే నిర్ణయించారు.

ఆర్​యూబీ కోసం రైల్వే డిపార్ట్​మెంట్ రెండు డీపీఆర్​లు రూపొందిస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇందులో అనుకూలమైన డీపీఆర్​ను ఆమోదించనున్నారు. ఇదిలా ఉండగా, ఆర్​యూబీ నిర్మాణంతో లారీలు, బస్సులు వంటి పెద్ద వెహికల్స్ రాకపోకలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. రైల్వే ట్రాక్​కు ఒకవైపు క్రషర్ ఉంది. పలు గ్రామాల మీదుగా సిద్దిపేట వైపు వెళ్లడానికి రోడ్డు మార్గం ఉండడంతో పెద్ద వాహనాలు ఇబ్బందిగా మారనుంది. స్టేషన్​ పరిసరాల్లో ఉన్న రోడ్డు పరిశీలిస్తే ఆయా గ్రామాలకు చిన్న వెహికల్స్ వెళ్లే అవకాశం మాత్రమే ఉంటుంది